ఈనెలాఖరులో మంత్రి మండలిని విస్తరించే దిశగా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం కసరత్తులు చేస్తుంది. ఈ నేపథ్యంలో లోకసభ ఎన్నికల ఫలితాలు ఆశావహుల అవకాశాల మీద ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో ననేది ఆసక్తిగా మారింది.
మొదటి దఫాలో మంత్రి వర్గంలో జిల్లాకు ప్రాతినిధ్యమే దక్కలేదు.దశాబ్దాల తరబడిగా కంచుకోట గా ఉన్న నిజామాబాద్ లోకసభ నియాజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి మరోసారి చేజారి పోయింది.
దిగ్గజ నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నే తమ అమ్ముల పొదిలో అస్రంగా వదిలినప్పటికీ కాంగ్రెస్ కు భంగపాటు తప్పలేదు. ఆయన వ్యూహరచన ఫలించలేదు.
తదుపరి క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవీ కోసం గంపెడు ఆశలు పెట్టుకున్న సుదర్శన్ రెడ్డి లోకసభ ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయోననేది కాంగ్రెస్ పార్టీ లో చర్చనీయాంశంగా మారింది. ఈసారి తమ నేత మంత్రి అవుతారని ఆయన వర్గీయులు ఆశాభావం తో ఉన్నారు.
లోకసభ ఎన్నికల పలితాలతో మంత్రి అవకాశాలకకు డోకా ఉండబోదనే భరోసా తో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం మీద తరుచు విరుచుక పడే అర్వింద్ ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డలని కాంగ్రెస్ నేతల భావించారు.
సీఎం రేవంత్ రెడ్డి సైతం నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం ను చాలెంజ్ గానే తీసుకున్నారు. అందుకే ఆయా నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలతోనూ ఆయనే నేరుగా టచ్ లోకి వెళ్లి గట్టిగా పనిచేయాలంటూ పురమాయించారు.
ఇంట బయట అర్వింద్ ఫై అసంతృప్తి ఎక్కువగా వుందని గ్రహించిన రేవంత్ రెడ్డి నిజామాబాద్ లో సునాయాసంగా గెలవచ్చని అంచనాకు వచ్చారు. అందుకే మొదట జహీరాబాద్ లోకసభ ఇంచార్జ్ గా ఉన్న సుదర్శన్ రెడ్డి నే నిజామాబాద్ బాధ్యతలు అప్పగించారు.
ఎలాగో లోకసభ పరిధి లో ఏడు సెగ్మెంట్ లలో ఇద్దరే ఎమ్మెల్యే లున్నారు. అందులో సుదర్శన్ రెడ్డి మరొకరు భూపతి రెడ్డి మిగితా అయిదు సెగ్మెంట్ లలో పెద్దనేతలే లేరు. సో దిగ్గజ నేతగా ముద్ర ఉన్న సుదర్శన్ రెడ్డి ఆయా సెగ్మెంట్ లలో నేతలను ఎన్నికల కార్యక్షేత్రంలో పరుగులు పెట్టించి పార్టీని విజయ తీరాలకు చేర్చుతారని అంతా భావించారు.
కానీ సుదర్శన్ రెడ్డి కేవలం తన సొంత సెగ్మెంట్ బోధన్ కే పరిమితం అయి పనిచేసారు. మిగితా సెగ్మెంట్ లలో ఎన్నికల ప్రచార సరళి నేతల మధ్య సమన్వయం ఎలా ఉన్నాయి అనేది లోతుగా పర్యవేక్షించలేక పోయారు.
కానీ బోధన్ లో భారీగా ఆధిక్యం సాధించడం మీద ఆయన ఎక్కువగా శ్రమించారు. ఆమేరకు జిల్లాలో ఏడు సెగ్మెంట్ లలోనే బోధన్ నుంచే అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ వచ్చింది. కానీ ఆయన సెగ్మెంట్ లో బీజేపీ దూకుడు ను మాత్రం అడ్డుకట్టవేయలేక పోయారు.
అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ కి జస్ట్ 33 వేల వోట్లు వచ్చాయి కానీ లోకసభ ఎన్నికల్లో రెండింతలు అంటే 69 వేల వోట్లు బీజేపీ కి వచ్చాయి. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీ తో గెలిచిన సుదర్శన్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ కు మెజార్టీ పెరిగేలా పనిచేసారు.
అసెంబ్లీ ఎన్నికలో సుదర్శన్ రెడ్డి 66 వేల వోట్లు సాధించారు. కానీ ఈసారి కాంగ్రెస్ కు 82 వేలు వోట్లు వచ్చాయి. కానీ కానీ బిఆర్ యస్ మాత్రం దాదాపు 55 వేల వోట్లు కోల్పోయింది. బిఆర్ యస్ వోట్లు ఎక్కువగా బీజేపీ కొల్లగొట్టింది.నిజామాబాద్ అర్బన్, బోధన్ సెగ్మెంట్ లలో ముస్లిం వోటర్లు గంప గుత్తగా కాంగ్రెస్ కువైపు వెళ్లారు.
కానీ హిందూ ఓట్ల ను తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ నేతలు చేతులు ఎత్తేసారు. మైనార్టీ వోట్లు గంప గుత్తగా వేయడంతో అర్బన్ బోధన్ లో కాంగ్రెస్ సహజంగానే మెజార్టీ సాధించింది. అందులో స్థానిక నేతల చమత్కారమేమి లేదు.
బిఆర్ యస్ వోట్ల ను కొల్లగొట్టి వుంటే గెలుపు వ్యూహం ఫలించేది.అందుకే కాంగ్రెస్ వ్యూహరచన బెడిసి కొట్టింది.ఘోర పరాజయం మూటగట్టుకుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సారి నిజామాబాద్ లోకసభ స్థానం కాంగ్రెస్ పార్టీ చేజార్చుకుంది.