ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ రవిశంకర్ నేతృత్వంలో బెంగుళూరులో కొనసాగుతున్న 45వ వార్షికోత్సవ వేడుకల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
ధ్యానం, యోగ, సత్సంగ్, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వార్షికోత్సవ వేడుకలతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ రవిశంకర్ 70 వ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు.
ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో 10వేలకు పైగా కేంద్రాలను నడిపిస్తూ ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక వైపు నడిపిస్తున్న సంస్థ అని కొనియాడారు.
ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ అనేక ఆశ్రమాలను నెలకొల్పడమే కాకుండా భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు.
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వేడుకల్లో పాల్గొని ధ్యాన మందిరాన్ని ప్రారంభించారని చెప్పారు. ఈ ధ్యాన మందిరంలో అడుగుపెట్టడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
