ఇందూరు నగరంలోని పలు ప్రాంతాలను అర్బన్ ఎమ్మెల్యే మేయర్ తో కలిసి మంగళవారం పర్యటించారు. 34వ డివిజన్ పరిధిలోని మిర్చి కాంపౌండ్, గోదాం రోడ్, బస్టాండ్ తదితర కాలనీలను మేయర్ కూరగాయల ఉమారాణి కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ గారు, స్థానిక కార్పొరేటర్ బంటు ప్రీతి ప్రవీణ్ తో కలిసి సందర్శించారు ఆయా ప్రాంతాల్లోని డ్రైనేజీ మరియు మంచినీటి సరఫరా వ్యవస్థలను పరిశీలించారు .
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచనలు చేయడం జరిగింది.
అలాగే, అవసరమైన ప్రాంతాల్లో కల్వర్టుల నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలన్నారు ముఖ్యంగా గాంధీగంజ్ కమాన్ వద్ద కల్వర్టు నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో, మిగిలిన అభివృద్ధి పనులను త్వరతిగతిన పూర్తి చేసి రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు
