తెలంగాణలో సి ఏ ఏ అమలు చేయబోమని చెప్పిన మంత్రి ఉత్తమ్ రెడ్డి వెంటనే మంత్రి మండలి నుంచి తొలగించాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేసారు. ఆయన బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
లోకసభ ఎన్నికల సమయంలో మంత్రి వ్యాఖ్యలు మతద్వేషాలు రెచ్చెగొట్టేలా ఉన్నాయన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి జగిత్యాల్ ను పీఎఫ్ ఐ కి అడ్డాగా చేస్తే ఉత్తమ్ తెలంగాణ ను రొహ్యాంగుల అడ్డా చేయిలానే ఆలోచనతో ఉన్నారా అని ప్రశ్నించారు.
పార్లమెంట్ లో చట్టం చేసాక అది అమలు చేయబోమని ఏ రాష్ట్రం చెప్పలేవన్నారు. ఇదో దేశ ద్రోహ చర్యగానే భావించాలన్నారు. అయినా ఉత్తమ్ ఏ హోదాలో మాట్లాడారు అయన హోం మంత్రి కాదు కదా . సీఎం పీసీసీ అధ్యక్షుడు హోం మంత్రి గా ఉన్న రేవంత్ రెడ్డి సి ఏ ఏ ఎన్ ఆర్ సి ల మీద ప్రభుత్వ వైఖరి ని స్పష్టం చేయాలనీ డిమాండ్ చేశారు.
ఉత్తమ్ మీద చర్యలు తీసుకోని రేవంత్ నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. అయిన ఈ చట్టం బీజేపీ తెచ్చింది కాదు గతంలో నెహ్రు ప్రభుత్వమే తెచ్చిందన్నారు. అయినా గతంలో తెలంగాణ ను భారత్ లో విలీనం చెయ్యక పొతే సర్దార్ పటేల్ ఏమి చేసాడో సి ఏ ఏ అమలు చేయకపోతే ఇప్పుడు అమిత షా కూడా అదే చేస్తాడని అర్వింద్ అన్నారు.
నల్గొండ ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే సీట్లు ఎక్కువగా వచ్చాయని కాంగ్రెస్ నేతలు విర్రవీగుతున్నారు. ఆ రెండు జిల్లాల ప్రజలు ఇలాంటి దేశ ద్రోహుల కు బుద్ధివచ్చేలా బీజేపీ ఎంపీ అభ్యర్థులను గెల్పించాలన్నారు. భవిష్యత్తు తరాల కోసం దేశ భద్రత కోసం వోటు వెయ్యాలి. అభ్యర్థులు మంచోళ్ళే ఉన్నారు మోడీ కోసం ఓట్లు వేయాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ .అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతి లు పాల్గొన్నారు