Saturday, April 25, 2026
HomeCRIMEదేవుడి సొత్తు కోసం హుండీ చెయ్యి పెట్టాడు ......ఇరక్క పోయాడు

దేవుడి సొత్తు కోసం హుండీ చెయ్యి పెట్టాడు ……ఇరక్క పోయాడు

తాను పనిచేస్తున్న గుడిలో నే చోరీ ప్రయత్నించి గుడి హుండీలో చెయి పెట్టాడు .కానీ అదే హుండీ లోనే ఇరుక్కోవడంతో భక్తులకు రెడ్ హ్యాండ్ గా దొరికి పోయాడు. కామారెడ్డి జిల్లా బిక్నూర్. మండలంలోని రామేశ్వరపల్లిలోని మాసుపల్లి పోచమ్మ ఆలయంలో చోటు చేసుకుంది. ఆ వీడియో సోషియల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఆలయంలో పనిచేసే పని చేసే సురేశ్ హుండి దొంగతనానికి ప్రయత్నించాడు.

దీనికోసం హుండీపై భాగాన్ని పగలగొట్టాడు చేసి అందులోని భక్తులు సమర్పించిన కానుకలను ఎత్తుకెళ్లడానికి సిద్ధం అయ్యాడు .ఈ క్రమంలోనే తన చెయి హుండీలోనే ఇరుక్కుపోయింది. దీంతో తప్పించుకునే మార్గం లేక అక్కడే ఉండిపోయాడు. ఉదయం గుడికి వచ్చిన భక్తులు సురేష్ చెయ్యి హుండీ లో ఇరక్క పోయి ఉండడం గమనించి నివ్వెరపోయారు.

దేహశుద్ది చేసి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు సురేష్ చేతి హుండీ లో నుంచి బయటికి తియ్యడానికి నానా తిప్పలు పడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!