పదేళ్ల తరవాత అధికారం కోల్పోయిన బిఆర్ యస్ పార్టీ వలస ల వరదతో ఒక్కసారి డీలా పడిపోయింది. లోకసభ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు మోసే దిగ్గజ నేతే లేకుండా పోయారు.. ఎమ్మెల్సీ కవిత ఈడీ అరెస్టు చేయడంతో జిల్లాలో ఆ పార్టీకి పెద్దదిక్కు లేకుండా పోయారు. దీనితో లోకసభ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే మధ్య సమన్వయం కుదురుతుందా లేదా అనేది ఉత్కంఠ గా మారింది. దిగ్గజ నేతగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ లోకసభ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
జిల్లాస్థాయిలో నూ ఫాలోయింగ్ ఉన్న ఆయన ప్రతికూల పరిస్థితులను ఎలా అధిగమిస్తారనేది ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ కవితే లోకసభ ఎన్నికను తన భుజాలమీద వేసుకొని పనిచేస్తుందని ఆపార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నా నేపథ్యంలో ఆమె లిక్కర్ కేసు అరెస్టు కావడంతో వారంతా డీలా పడ్డారు.
దీనికి తోడు పదేళ్ల పదవుల పొందిన ద్వితీయ శ్రేణి నేతలు పార్టీని వదిలేస్తున్నారు వలసలు పార్టీని మరింత బలహీనం చేస్తున్నాయి. నిజానికి అరెస్టు కు ముందు వరకు కవిత ఎంపీ అర్వింద్ ను ఈసారి ఎన్నికల్లో ఓడించాలనే పట్టుదలతో ఆమె వ్యూహరచన చేస్తూ వచ్చారు . అసెంబ్లీ ఎన్నికల్లోనూ కోరుట్ల లో పోటీచేసిన అర్వింద్ ఓటమి లోనూ ఆమె కీలకంగా పనిచేసారు.
ఆమె నిజామాబాద్ అర్బన్ బోధన్ నియోజకవర్గాలకు ఇంచార్జి గా వుంటూనే కోరుట్ల లో జాగృతి సభ్యులను పురమాయించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అర్వింద్ ఓటమికి వ్యూహం ఫలించడంతో ఎంపీ ఎన్నికల్లోనూ అదే ఫార్ములా అమలు చేయడానికి ఆమె సిద్ధం అయ్యారు గతంలో ఎంపీ గా పనిచేసిన ఆమె 2019 ఎన్నికల్లో ఓడిపోయాక కూడా లోకసభ నియోజకవర్గంలో పట్టు కొనసాగిస్తూ వచ్చారు.
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ గా ఉన్నారు. పార్టీ పాలన వ్యవహారాల్లో ఆమె చెప్పిందే ఫైనల్ అన్నట్లుగా వుండేది. మంత్రులు ఎమ్మెల్యే లు ఆమె మాట జవదాటని పరిస్థితి ఉండే. ఓ దశలో ఆమె పెత్తనం ఎమ్మెల్యే భరించలేక పోయారు అందుకే లోకసభ ఎన్నికల్లో వారంతా చేతులెత్తేసారు. నిజామాబాద్ లోకసభ పరిధి లో ఏడు అసెంబ్లీసెగ్మెంట్ లలో వరుసగా రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో క్లిన్ స్వీప్ చేసింది.
అయినప్పటికీ ఎంపీ ఎన్నికల్లో కవిత అనూహ్యంగా ఓడిపోయారు. కానీ ఈసారి ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదల కవిత ఉండే. ఓ దశలో బాజిరెడ్డి గోవర్ధన్ పేరు ను ఆమె తెరమీదికి తెచ్చారు. సామజిక సమీకరణ …అనుభవం …మాస్ ఫాలోయింగ్ లను పరిగణలోకి తీసుకోని అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపేలా చేసింది. కానీ ఎన్నికల ప్రచార ఘట్టం మొదలవ్వకముందే లిక్కర్ కేసు లో ఆమె జైలు పాలయ్యారు.
దీనితో లోకసభ ఎన్నికల్లో పార్టీ లో ముఖ్య నేతలను ఒక్కటిగా నడిపించే దిగ్గజ నేత కొదవ బిఆర్ యస్ వెంటాడుతోంది. గతంలో జిల్లాలో ఎమ్మెల్యే లమధ్య విభేదాలు తీవ్రస్థాయిలో వుండేది. మంత్రి గా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి ఏ ఎమ్మెల్యే తో నూ సఖ్యత తో లేకుండే. లోకసభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పార్టీ ఇలాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించే పనిలో ఉంది.
కవిత ఇప్పట్లో బయటికి వచ్చే పరిస్థితి లేక పోవడంతో లోకసభ ఎన్నికల ఇంచార్జ్ గా కీలక నేతను రంగంలోకి దించే యోచనలో అధినేత ఉన్నారు.