జాన రమేష్: ఇది సంగతి; ఆర్మూర్ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కారు దిగి ఒక్కరోక్కరు హస్తం గూటికి చేరుతున్నారు. బి.ఆర్.ఎస్ నేతలు. ముఖ్యంగా ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గం లలో ద్వితీయ శ్రేణి నాయకులంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ జెడ్పిటిసి అల్లకొండ భారతి రాకేష్ చంద్ర.టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు .
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తన అనుచరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేల్పూర్ జడ్పిటిసి అల్లకొండ భారతీయ రాకేష్ చంద్ర మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వ జనరంజక పాలన చూసి అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి ద్వారానే సాధ్యమని భావిస్తున్నట్టు వెల్లడించారు.
రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పడగల్ కొట్టాల చిన్నారెడ్డి తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.