ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న ఇద్దరు కూలీలకు విద్యుత్ మెయిన్ లైన్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని పూసల గల్లి లో జరిగింది. స్లాబ్ కు అవసరమైన ఐరన్ ను కింది నుంచి భవనం మీదికి తీసుకెళ్తుండగా మెయిన్ లైన్ ఆ ఐరన్ రాడు తగలడం పెద్దఎత్తున మంటలు లేచాయి. ఈ ప్రమాదం లో ఒకరి కుడి కాలిపోయింది. మరొకరు అపస్మార స్థితి లో పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు