నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో దారుణఘటన జరిగింది. పట్టపగలలే గుర్తు తెలియని ఆగంతకులు దోపిడీ హత్య కు పాల్పడ్డారు.మహిళా ఇంట్లో ఎవరు లేని సమయాన్ని అదునుగా చేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు సంతోష్ నగర్ లో నివాసం ఉంటున్న లాస్య అనే వివాహితను గొంతు కోసి హత్యచేసి ఆమె ఒంటిమీద నగలు ఎత్తుకెళ్లారని అనుమానిస్తున్నారు . లాస్య భర్త బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాల్లో ఉన్నాడు. మృతురాలు లాస్య కు 7 నెలల కూతురు ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న ఆర్మూర్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.