లిక్కర్ కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ మరో 3 రోజుల పాటు పొడగించింది. శనివారం ఈడీ కవిత ను రౌస్ అవెన్యూ కోర్టు లో హాజరు పర్చారు. దీంతో ఈ నెల 26 వరకు కవితను ఈడీ విచారించనుంది. ఈ నెల 26 ఉదయం 11 గంటలకు కవితను ఈడీ కోర్టులో హాజరుపరచనుంది. వారం రోజుల కస్టడీ లో . విచారణకు కవిత సహకరించడం లేదని ఈడీ ఆరోపించింది.
లిక్కర్ కేసులో కీలక నిందితుడు సమీర్ మహీంద్రతో కలిపి కవితను ప్రశ్నించాలని తెలిపింది. తమ సోదాల్లో కవిత మేనల్లుడి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నా అతను ఆచూకీ దొరకడం లేదన్నారు .ఈడీ తరపు న్యాయవాది కోర్టులో కీలక వాదనలు వినిపించారు. సోదాల సమయంలోనే కవిత ఫోన్‌ను సీజ్ చేశామని చెప్పారు. మొబైల్‌లో కొంత డేటా సమాచారం డిలీట్ చేసినట్లు గుర్తించామని తెలిపారు.
కవిత ఫోన్ నుంచి సేకరించిన డేటాను విశ్లేషించామని అన్నారు. ఫోరెన్సిక్ అడిట్ కూడా చేయాల్సి వుందన్నారు @@ రౌస్ అవెన్యూ కోర్టు కు వచ్చిన కవిత మాట్లాడుతూ
నాపై తప్పుడు కేసులు పెట్టారు.
ఈడీ అధికారులు అడిగిన వివరాలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారు
అక్రమ కేసులపై కోర్టులో పోరాటం చేస్తాను.