పదేళ్లు అధికారంలో ఉండి ఎమ్మెల్యే గా పనిచేసి రైతుల ను గోసపెట్టిన బాజిరెడ్డి గోవర్ధన్ మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ ధ్వజమెత్తారు. కేవలం అర్వింద్ గెలుపు ను అడ్డుకోవడానికే మున్నూరుకాపు వోట్లను చీల్చడానికే గోవర్ధన్ పోటీ కి సిద్ధం అయ్యారని మండిపడ్డారు ఆయన శనివారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో మాట్లాడారు. 20,21 ఫ్యాకేజి పనుల పూర్తీ చేసి లక్ష ఎకరాల కు సాగు నీరిస్తానని హామీ అమలు చేయడం చేతగాని గోవర్ధన్ అసెంబ్లీ ఎన్నికల్లో మంచిప్ప లో ఎన్నికల ప్రచారం చేయడానికి కూడ వెళ్లలేక పోయారన్నారు.
పదేళ్లు ఎమ్మెల్యే గా పనిచేసి ఎన్ యస్ యాప్ ఎన్ సి యస్ యాప్ ఫ్యాక్టరీ లను ఎందుకు తెరిపించలేక పోయారో బాజిరెడ్డి రైతులకు సమాధానం ఇచ్చాకే నామినేషన్ వేయాలన్నారు. ఆరోగ్య బాగోలేదని నెలకు పది రోజులు ఆసుపత్రిలోనే వుంటున్నాని అసెంబ్లీ ఎన్నికల్లో తిరగలేనని టికెట్ కొడుకు ఇవ్వాలని అడిగిన బాజిరెడ్డి ఇప్పుడు ఏడు నియోజకవర్గాలు ఎలా తిరుగుతారని ప్రశ్నించారు.
వయస్సు పైబడి ఎంపీ అర్వింద్ మీద ఇష్టారీతిన మాట్లాడుతున్న కాంగ్రెస్ బిఆర్ యస్ నేతలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధిచెప్తారన్నారు. అర్వింద్ మీద వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు సంగతి మీద ఆపార్టీ నేతలు మాట్లాడాలన్నారు. ఎంపీ అభ్యర్థి ఎవరిని పోటీ కి నిలపాలో ఆ పార్టీకి దిక్కుతోచడం లేదన్నారు.
షుగర్ ఫ్యాక్టీరి తెరిపిస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక కమిటీ లపేరుతో కాలయాపన చేస్తుందని దుయ్యబట్టారు. కొర్టు కేసులు క్లియర్ చేయిస్తే మోడీ మళ్ళీ ప్రధాని కాగానే అర్విందే షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు చేతికి వచ్చిన పంట కోల్పోయారని వారికి ఎకరా 25 వేల రూపాయల నష్టపరిహారం అందేలా కాంగ్రెస్ నేతలు చొరవ తీసుకోవాలన్నారు.
పసుపుబోర్డు విషయంలో అనవసర ఆరోపణలు తగవన్నారు అర్వింద్ చేసిన ప్రయత్నాల వల్లే పసుపు ధర పెరిగిందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్వింద్ బోర్డు సాధించారని బోర్టు మంజూరు చేస్తూ భారత ప్రభుత్వం గెజిట్ కూడా ఇచ్చిందన్నారు.