నిజామాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ కి తిరుగులేని ఓట్లిచ్చినం… సీట్లిచ్చినం అందుకే రాష్ట్ర కమిటీ లో మా వాటా పదవులు కావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ను ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు.
సోమవారం జిల్లా కేంద్రంలో దినేష్ కులచారి అధ్యక్షతన ఏర్పాటీ చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎక్కడైతే పార్టీకి బలం ఉంటుందో అక్కడ పదవులు కచ్చితంగా ఇవ్వాలన్నారు.
పార్టీని అభివృద్ధి చేసే బాధ్యత, కొత్తవారికి అవకాశం ఇచ్చే బాధ్యత రాష్ట్ర అధ్యక్షుడిదన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేయాలని అందుకు తామంతా మీ వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు. ఇందూరు అంటేనే బీజేపీ అడ్డా అని అన్నారు.అసెంల్బీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ లోని 7 సెగ్మెంట్లలో డిపాజిట్ కోల్పోకుండా మా కార్యకర్తలు శ్రమించారని గుర్తుచేశారు.
అలాగే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్,ఆర్మూర్,కోరుట్ల,బాల్కొండ నియోజకవర్గలలో బీజేపీ కి 50 శాతానికి పైననే ఓటింగ్ వచ్చిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగిత్యాలలో కూడా దాటిస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ లోని నాయకులు, కార్యకర్తలు ఉత్సాహం చూస్తే జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని బీజేపీ గెలిచిందని ముందుగా ఇందూరు నుంచే అనౌన్స్ మీకు వస్తుందని రామచందర్ రావు కు తెలిపారు.
అలాగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మున్సిపల్ చైర్మన్ కూడా ఎక్కడి నుంచే వస్తుందని నమ్మకంగా తెలిపారు. పార్టీకి కార్యకర్తలే సంపద అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తూ పాలన కొనసాగిస్తుందన్నారు. గ్రామాల్లో కాషాయ కండువా కప్పుకున్న కార్యకర్తలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ఆయన ఇవ్వడం లేదని కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని ఆరోపించారు.
అందుకే బీజేపీ కార్యకర్తల కోసం రాష్ట్రంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అందుకు తామంతా మీ వెనక ఉన్నామని తెలిపారు.ఇక రాష్ట్రంలో కొందరు బీజేపీ నీ ఎదగకుండా అపుతున్నారని,అందుకే వారంటే నాకు పడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాకేశ్ రెడ్డి బీజేపీ చేరేసమయంలో పార్టీలోని కొందరు పెద్దలు అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. అనవసర పుకార్లు పుట్టించి అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ విషయమై పార్టీ అధిష్టానం దృష్టిగా తీసుకెళ్లి రాకేశ్ రెడ్డి చేర్చుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామనా పుకార్లు సృష్టించిన నేతలే గత ఎన్నికల్లో ఓట పాలయ్యారని వ్యాఖ్యానించారు.అలాగే ఇక వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
