HomeTelanganaNizamabadసామాన్య ముస్లింల కోసం వక్ఫ్ బోర్డు బిల్లు..వక్ఫ్ ఆదాయం ఓవైసి,ముస్లిం కాంగ్రెస్ చెంచాలకు ఉపయోగపడుతుంది..

సామాన్య ముస్లింల కోసం వక్ఫ్ బోర్డు బిల్లు..వక్ఫ్ ఆదాయం ఓవైసి,ముస్లిం కాంగ్రెస్ చెంచాలకు ఉపయోగపడుతుంది..

కనిపించిన ప్రతి భూమీ, ఆస్తీ తమదేనంటూ నియంత్రణలోకి తీసుకుంటున్న వక్ఫ్‌ బోర్డుల అపరిమిత అధికారాన్ని కట్టడి చేసి సామాన్య ముస్లింల కోసం వక్ఫ్ బోర్డు బిల్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు.

సోమవారం నగరంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో మూడవ అతిపెద్ద భూమి ఈ వక్ఫ్ బోర్డు అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ వక్ఫ్ బోర్డు ను దుర్వినియోగం చేస్తుందని అన్నారు.

అలాగే 2019-20 లో 166 కోట్ల నుంచి 9లక్షలు చేరిందని తెలిపారు.ముఖ్యంగా 1995 పీవీ నరసింహారావు కాలంలో ఈ బోర్డు ఎగ్జిక్యూటివ్ బోర్డ్ గా ఏర్పడి1996లో ఎన్నిక కోసం జ్యుడీషియల్ సవరణలు చేశారని గుర్తు చేశారు.

2013 సోనియా గాంధీ ఈ వక్ఫ్ బోర్డు కు సుప్రీం కోర్టుకు మించి జ్యుడీషియల్ అధికారాలు ఇచ్చి అతి ప్రమాదకరంగా చేశారని ద్వజమెత్తారు. ప్రస్తుతం తెలంగాణ లో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను 400 సంవత్సరాల క్రితం ఔరంగజేబు ఇచిన భూములుగా ఈ వక్ఫ్ బోర్డు మార్చుకున్నారని అన్నారు.

మేము చేసిన సవరణ వల్ల మీరు హైకోర్టు,సుప్రీంకోర్టు కు వెళ్ళవచ్చని తెలిపారు.గతంలో వక్ఫ్ బోర్డులో కేవలం సన్నీలు మాత్రమే ఉండేదని,కానీ ఇప్పటి నుంచి అందరూ కూడా అర్హులను అని చెప్పారు. ఇక నుంచి వక్ఫ్ బోర్డు నిధులు ప్రతి పేద ముస్లిం లకు వచ్చే విధంగా అమలు చేశామన్నారు.

ప్రస్తుతం తెలంగాణ చేవెళ్ల,నర్సంపేట నియోజకవర్గంలో 1200 ఎకరాల భూములు, పరిగి లొ 778 ఎకరాలు, హైటెక్ సిటీ,శేరిలింగంపల్లి,చుట్టూ భూములు రైతులను మోసం చేసి 2925 నాటికి వక్ఫ్ బోర్డులో భూములు 38 లక్షల ఎకరాలకు చేరిందని ఆయన పేర్కొన్నారు.

వక్ఫ్ బోర్డు కు సుమారు రూ 4 లక్షల ఆదాయం వస్తే బోర్డు కు 400 రూపాయలు ఇస్తున్నారని మిగతా డబ్బులు ఓవైసీ,కాంగ్రెస్ మైనార్టీ నాయకులు మింగుతున్నారా అని ప్రశ్నించారు.

అందుకే ఈ చట్టం తీసుకొచ్చామని అన్నారు. వక్ఫ్ బోర్డు లో హిందువులు కూడా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి,స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments