HomeTelanganaNizamabadనిజామాబాద్ ను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం -రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్ ను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం -రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ప్రెస్ మీట్ లో వెల్లడి – పాల్గొన్న.. ఎమ్మెల్యే భూపతిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి – కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై ఘాటు వ్యాఖ్యలు – అతి త్వరలో మంత్రివర్గ విస్తరణ – త్వరలోనే ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డిలతో కలిసి సీఎంను కలుస్తాంనిజామాబాద్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్తామని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్న, కాంగ్రెస్ ప్రభుత్వంలో అతి త్వరలోనే మంత్రివర్గ విస్తరణను చేపట్ట నున్నట్టు వెల్లడించారు.

బంగారు తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని ఆయన విమర్శించారు. కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు లు రైతు రుణమాఫీ విషయంలో రైతులను అనవసరంగా రెచ్చగొట్టి ప్రయత్నం చేస్తున్నారన్నారు.

గత తొమ్మిది నెలల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత తొమ్మిది సంవత్సరాల లో లేనివిధంగా నలభై ఐదువేల పై చీరకు ఉద్యోగాలను భర్తీ చేసినామని వివరించారు.

ఆర్థిక లేమిలో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియా వేదికగా అబద్ధపు ప్రచారాలను చేస్తూ పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నారన్నారు.

ప్రతిపక్ష పార్టీలు బాధ్యతయుతంగా మెలగాలని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని బదనము చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని హితవు పలికారు. సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీలు చేసే అవస్తవాలను ప్రజలు గ్రహించాలని కోరారు.

గత ప్రభుత్వ పరిపాలనను ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పరిపాలనను ప్రజలు ఒకసారి బేరిజు వేసుకోవాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డిలు కలిసి త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు తీసుకువస్తామన్నారు.

2021 ప్యాకేజీ ద్వారా సాగునీటికి పెద్ద పీఠం ఇస్తామన్నారు. నీళ్లు నిధుల నియామకాల విషయంలో కెసిఆర్ ప్రభుత్వం విఫలమైందని, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టి 50 వేల మంది పై చీలుకు ఉద్యోగాల భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని దక్కుతుందన్నారు. ఇంకా రానున్న రోజుల్లో ప్రతి హామీని తూచ తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.

ఆర్థిక మంత్రిగా చేసిన హరీష్ రావు అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తూ ఉండడం హాస్యాస్పదం అన్నారు. అప్పుల తెలంగాణను కాంగ్రెస్ పార్టీ చేతికి విఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిపోయిందని, ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉన్న ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుందని హామీఇచ్చారు.

కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు,రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి,రూరల్ ఎంఎల్ఏ భూపతి రెడ్డి,రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హందాన్,పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్,నగర కాంగ్రెస్ అధ్యక్షులు,నుడ చైర్మన్ కేశ వేణు,ఆర్మూర్ ఇన్చార్జి వినయ్ రెడ్డి,

మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు,సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణ గౌడ్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,జిల్లా NSUI అధ్యక్షులు వేణు రాజ్,ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్,పీసీసీ మాజీ కార్యదర్శి రం భూపాల్,సేవాదళ్ సంతోష్,ఓబీసీ నరేందర్ గౌడ్,బొబ్బిలి రామకృష్ణ, కార్పొరేటర్ రోహిత్,అడ్వకేట్ రామకృష్ణ,అబ్దుల్ ఏజాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments