తాను ఎప్పటికైనా సరే ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తాని ఎమ్మెల్సీ కోదండరాం స్పష్టం చేసారు. ఆయనగవర్నర్ కోటలో ఎమ్మెల్సీ నియామకమైన తర్వాత మొదటిసారిగా నిజామాబాద్ నగరం కు వచ్చారు కోదండరాంకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం నగరంలోని ఎస్ వి డిగ్రీ కళాశాల లో పార్టీ శ్రేణులు సన్మానించారు.
జిల్లాలోని పలు ఉద్యోగ సంఘాలు, కళాశాలలా అసోసియేషన్ ,మాల మహానాడు మాదిగ దండోరా సంఘం,అడ్వకేట్ సంఘాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఘనంగా సన్మానం చేశారు అనంతరం ఆయన తెలంగాణ జన సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నగరంలోని పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రూ.లక్ష వరకు భీమా అందజేస్తామని హామీ ఇచ్చారు.అలాగే నగర అభివృద్ధి చేసేందుకు కావల్సిన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్తానని హామీ చేశారు.
సమావేశం అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి నగరంలోని మాలపల్లి లో ఏర్పాటు చేసిన మైనార్టీ సమావేశంలో పాల్గొన్నారు./// మైనార్టీ కాలేజీ ఓపెన్ అయ్యేలా కృషి చేస్తా ….మాల పల్లి మైనార్టీ విద్యార్థినిల కోసం నిర్మించిన భవనంలో కాలేజీ మొదలయ్యేలా చెస్తా హామీ ఇచ్చారు
