క్రమశిక్షణ కు మారు పేరున్న బీజేపీ లో మోడీ కి వీర భక్తుడిగా కట్టర్ హిందూ గా ముద్ర ఉన్న ఎంపీ అర్వింద్ ఒక్కసారి గా సొంత పార్టీ మీదే ఎందుకు ధిక్కార స్వరం వినిపిస్తున్నారనేది ఆ పార్టీ హాట్ టాపిక్ గా మారింది.
రెండో సారి ఎంపీ అయ్యాక అర్వింద్ మునుపటి దూకుడు తగ్గించారనే చర్చ సాగుతున్న నేపథ్యంలో అర్వింద్ పార్టీ సంస్థాగత వ్యవహారాలమీద ధిక్కార స్వరం అందుకోవడం కలకలం రేపింది.
పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవీ రేసులో ముందున్న నేపథ్యంలో నాయకత్వ వైఫల్యాలను ఎందుకు లేవనెత్తారనేది ఎవరికి అంతు చిక్కడం లేదు.
ఎప్పుడు ప్రత్యర్థుల మీద విరుచుక పడే అర్వింద్ ఈసారి సొంత పార్టీ నాయకత్వ వైఫల్యాలను ఎండగట్టడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా ? లేదంటే జాతీయ నాయకత్వం నుంచి ఏమైన సంకేతాలు వచ్చాయా అనే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది.
దివంగత నేత డీఎస్ తనయుడి గా కాంగ్రెస్ మూలాలున్న అర్వింద్ అనూహ్యంగా బీజేపీ లో కి ఎంట్రీ ఇచ్చారు పార్టీ ప్రాబల్యం అంతంత మాత్రంగానే ఉన్న జిల్లాలో ఆయన ఎవ్వరి అంచనాలకు అందనంతంగా పార్టీ విస్తరించారు.
ఏకంగా ఇద్దరు ఎమ్మెల్యే గెలిచారు మరో రెండు చోట్ల రెండో స్థానం లో నిలిపారు ఆయనా రెండో సారి ఎంపీ గా గెలిచారు. ఈసారి మోడీ క్యాబినెట్ లో చోటు ఖాయమని భావించారు కానీ నిరాశ చెందారు.
అయితే రాష్ట్ర అధ్యక్ష పదవీ ఇవ్వాలని ఆయన ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.ఈ టైమ్ లో ఆయన వ్యూహాత్మక మౌనం పాటించాల్సింది పోయి నాయకత్వం ను దెప్పి పొడవడం వెనుక ఆంతర్యం ఎవరికీ అంతు చిక్కడం లేదు.
రాష్ట్రం నుంచి మోడీ క్యాబినెట్ లో ఇద్దరు మంత్రులున్నారు జాతీయ స్థాయి నాయకులు సైతం ఉన్నా ప్రజల్లో పార్టీ ప్రాబల్యం క్రమంగా తగ్గుతుండడం క్యాడర్ ను సైతం కలవరపెడుతుంది. రాష్ట్ర అధ్యక్షుడి గా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గా నియామకం అయ్యాక ఆయన పార్టీ వ్యవహారాల మీద కనీస దృష్టి పెట్టలేక పోతున్నారనే విమర్శ సర్వత్ర ఉంది.
లోకసభ ఎన్నికల తర్వాత సంస్థాగత కార్యాచరణ లేకపోవడంతో పార్టీ క్యాడర్ లో నిస్తేజం ఆవరించింది.
స్థానిక సంస్థల ఎన్నికలకోసం క్యాడర్ ను సమాయత్తం చేయాల్సిన సమయంలో రాష్ట్ర నాయకత్వం నామ మాత్రంగా మారడం ద్వితీయ శ్రేణిలో నేతల్లో అసహనం వ్యక్తం అవుతుంది.
అర్వింద్వ్యాఖ్యల్లోనూ ఇదే అసహనం వ్యక్తం అయింది. తనకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తే స్థానిక సంస్థల ఎన్నికలలో సానుకూల ఫలితాలు తెస్తారని కొందరు కీలక నేతలు జాతీయ నేతలు చెప్తున్నారు
