Tuesday, January 20, 2026
HomeTelanganaNizamabad‘విద్యుత్ ప్రజా బాట’తో సమస్యలు పరిష్కారం..గాజులపేటలో వేలాడుతున్న విద్యుత్ తీగలకు మోక్షం..

‘విద్యుత్ ప్రజా బాట’తో సమస్యలు పరిష్కారం..గాజులపేటలో వేలాడుతున్న విద్యుత్ తీగలకు మోక్షం..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘విద్యుత్ ప్రజా బాట’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం డి-1 సెక్షన్ పరిధిలోని గాజులపేట ఏరియాలో విద్యుత్ మరమ్మతులు చేపట్టారు. ఏఈ కే. నాగేశ్‌ పర్యవేక్షణలో విద్యుత్ సిబ్బంది కాలనీల్లో పర్యటించి ప్రమాదకరంగా మారిన లూజ్ లైన్లను (వేలాడుతున్న తీగలను) సరిచేశారు.

ఈ సందర్భంగా ఏఈ నాగేశ్‌ మాట్లాడుతూ.. వినియోగదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

విద్యుత్ లైన్ల వద్ద ఉన్న ఆటంకాలను తొలగించడంతో పాటు, ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా సిబ్బంది దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాగే వినియోగదారులు 24 గంటలూ అందుబాటులో ఉండే 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినా, ఇతర సాంకేతిక ఇబ్బందులు ఉన్నా సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు.తమ ప్రాంతంలో నెలల తరబడి వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయడంపై గాజులపేట కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఫోర్ మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్, లైన్ మెన్, అసిస్టెంట్ లైన్ మెన్లతో పాటు స్థానిక నివాసితులు సంతోష్, శ్రీనివాస్, రవి, కదీర్భాయ్, అక్బర్, వినీత్, మనోజ్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!