HomeCRIMEఉరి వేసుకుని యువకుడు బలన్మారణం...

ఉరి వేసుకుని యువకుడు బలన్మారణం…

ఉరి వేసుకుని యువకుడు బలన్మారణం చెందిన ఘటన నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఐదవ టౌన్ ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఎనబై కోటర్స్ కు చెందిన సుమన్(28).

గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై తరుచుగా ఇంట్లో తల్లితో గొడవ పడేవారు. ఈ మేరకు రేణుకా నగర్ లో ఉంటున్న తన కూతురు ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి సుమన్ ఒక్కడే ఇంట్లో నివసిస్తున్నారు.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వినయ్ అనే వ్యక్తి తో గొడవ పడ్డాడు.అందుకు తగిన స్థానికులు గమనించి వారి ఇరువురిని మెప్పించి బెదిరించడం జరిగింది. ఈ మేరకు బుదవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు.మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments