సైబారాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి లోని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మదనం గ్రామంలో బుధవారం రియల్టర్ కమ్మరి కృష్ణ దారుణ హత్యకు గురయ్యారు.
హత్య కు పాల్పడిన వారిని పోలీసులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాలే హత్య కు దారితీశాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
కమ్మరి కృష్ణ అలియాస్ కేకే తన సొంత ఫామ్ హౌస్ లో తనకు సన్నిహితుడు గా ఉండే బాబా అనే వ్యక్తి దారణంగా హత్య చేశాడని తనముందే .
కత్తులతో దాడి చేశారని మృతుడి భార్య పేర్కొంది. దుండగులు. తీవ్రంగా గాయపడిన కేకేను శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలిస్తుండగా మృతి చెందాడు.
భూ లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ హైదర్ షాకోట్ కు చెందిన కమ్మరి కృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కన్వెన్షన్ సెంటర్లు, ఫాంహౌస్ నిర్మాణాలు చేస్తూ కేకే గా గుర్తింపు పొందారు.