పొలంలో నీళ్లు కట్టేందుకు వెళ్లిన యువకుడిపై పిడుగు పడటంతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఇందల్వాయి మండలం దేవీతండా పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. దేవీతండాకు చెందిన బధావత్ చరణ్ (18) పొలానికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చరణ్‌ను స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే నిజామాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సర్పంచ్ గణేశ్ నాయక్ తెలిపారు. యువకుడి మృతితో దేవీతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
