నిజామాబాద్ నగర శివారు లోని బైపాస్ రోడ్డు లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యారు మద్నూర్‌కి చెందిన లక్ష్మణ్(30) లారీ క్లీనర్‌గా పని చేసేవాడు.
శుక్రవారం కాలూరు కూడలి వద్ద తీవ్ర గాయాలతో పడిఉన్న లక్ష్మణ్‌ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అతడిని ఎవరో తీవ్రంగా కొట్టినట్లు గుర్తించారు.
ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాతకక్షలు నేపథ్యంలో హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
