అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మోపాల్ మండలంలో చోటుచేసుకుంది… ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని న్యాయకల్ గ్రామానికి చెందిన కాలూరి ప్రసాద్ రావు.
భార్య, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి మద్యానికి బానిసై అప్పులు ఎక్కువగా అయ్యాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై గ్రామ శివారులోని అతని వ్యవసాయ క్షేత్రంలోని షెడ్డులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడే ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ గమనించి కుటుంబ సభ్యులకు తెలిపారు.
కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యాదగిరి గౌడ్ పేర్కొన్నారు.
