.
నిజామాబాద్ జిల్లాలో లంచం తీసుకుంటుండగా ఓ ఎస్సై ని ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. వర్ని ఎస్సైకృష్ణ కుమార్ ను ఓ కేసులో రూ 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. వర్ని మండల కేంద్రంలోని కోటయ్య క్యాంప్ కు చెందిన మాజీ యంపిటిసి సభ్యుడు నాగరాజు కి అతని స్నేహితుడి కి ఈనెల 4 న మధ్య ఘర్షణ జరిగింది.
దీనితో బాధితుడి నేరుగా వెళ్లి పిర్యాదు చేసాడు. దీనితో ఎస్సై కృష్ణకుమార్ అదే రోజు నాగరాజు కు ఫోన్ చేసి పరుష పదజాలం తో తిట్టాడు. కేసు నమోదు కావడంతో స్టేషన్ బెయిల్ ఇవ్వాలని కోరగా 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసాడు.
చివరికి రూ 20 వేల కు బేరం కుదిరింది. కానీ నాగరాజు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్క పథకం వేసి లంచం తీసుకుంటుండగా స్టేషన్ లోనే పట్టుకున్నారు
