నగరంలోని మూడవ టౌన్ పరిధిలో పోగొట్టుకున్న 32 సెల్ ఫోన్లను రికవర్ చేసినట్లు ఎస్ఐ హరిబాబు తెలిపారు.నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధి లో పోగొట్టుకున్న ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేయడానికి ప్రత్యేకించి ఓ కానిస్టేబుల్ ను కేటాయించడం జరిగింది.
టౌన్ 3 పోలీస్ స్టేషన్ పరిధి లో కానిస్టేబుల్ బి. సాగర్ సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెప్టెంబర్ 16 నాడు 8 ఫోన్లు, సెప్టెంబర్ 20 నాడు 10 ఫోన్లు, సెప్టెంబర్ 30 నాడు 14 ఫోన్లు మొత్తం 32 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు.
బాధితులు పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి పొందడంతో పోలీస్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.అలాగే ఎవరైనా సెల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే సీఈఐఆర్ పోర్టల్ లో రిపోర్ట్ చేయాలి, సిమ్ బ్లాక్ చేసి కొత్త సిమ్ తీసువాలని ఎస్ఐ హరి బాబు గారు సూచించారు.
