HomeDevotionalమార్కెట్ లకు దసరా జోష్..కిటకిటలాడిన షాపింగ్‌మాల్‌లు

మార్కెట్ లకు దసరా జోష్..కిటకిటలాడిన షాపింగ్‌మాల్‌లు

వస్త్ర దుకాణాలు ఆకాశాన్నంటిన పూలు, గుమ్మడికాయలు, పూజా సామగ్రి ధరలు..దసరా పండుగకు పట్టణాలు, పల్లెలు ముస్తాబయ్యాయి.

జిల్లావ్యాప్తంగా వేడుకలు వెభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా జరుపుకొంటున్న దసరా పండగ సందర్భంగా ఆయుధ పూజ, విజయదశమిని జరుపుకునేందుకు నగరవాసులు, గ్రామీణులు పూలు, పండ్లు, కొత్త దుస్తులు, సరుకులు కొనడానికి ఎగబడ్డారు. దీంతో జిల్లాలోని వీధులు కిక్కిరిశాయి.

షాపింగ్‌మాల్‌లు, పూలు, పండ్లు, గుమ్మడికాయలు దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. జిల్లాకేంద్రమైన గాంధీ చౌక్ నుంచి బస్టాండ్, రైల్వే స్టేషన్, కంటేశ్వర్ వరకు రోడ్డుకు ఇరువైపులా పూలు, గుమ్మడికాయల దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు.

పండుగ నేపథ్యంలో రేట్లు విపరీతంగా పెంచేశారు. సాధారణ రోజుల్లో బంతి పూలు కిలో రూ.60 నుంచి రూ.80 ధర పలుకుతాయి. ప్రస్తుతం బంతిపూలు కిలో రూ. 120 వరకు విక్రయిస్తున్నారు.పండుగ సామగ్రి, కొత్తబట్టలు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు తరలిరావడంతో మార్కెట్లలో రద్దీ నెలకొంది.

విజయదశమి సందర్భంగా పెద్ద సంఖ్యలో వాహనాలు కొనుగోలు చేస్తున్నారు.ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్లను తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో చాలా వస్తువుల ధరలు తగ్గాయి. జీఎస్టీ తగ్గింపు పండుగ షాపింగ్ చేస్తున్న ప్రజలకు కలిసొచ్చింది. కార్లు, బైక్ల రేట్లు భారీగా తగ్గడంతో ప్రజలకు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

దీంతో జిల్లాలో పలు షోరూంలు జనాలతో కిటకిటలాడుతున్నాయి. దాంతో పలు షోరూంల్లో ఇప్పటికే కార్లు బుక్ చేసుకున్నారు. గురువారం విజయదశమి సందర్భంగా కార్లను తీసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

అలాగే దసరా పండుగకు పట్టణాలు, పల్లెలు ముస్తాబయ్యాయి. జిల్లావ్యాప్తంగా వేడుకలు వెభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments