నిజామాబాద్ కమీషనరేట్ లోని సైబర్ క్రైమ్ పోలీసులకు శనివారం అదనపు డిసిపి కోటేశ్వర రావు 4 ద్విచక్ర వాహనాలను అందజేశారు. శాంతిభద్రతలకు సంబంధించిన వివిధ రకాల విధినిర్వహణ కోసం ఈ వాహనాలను వినియోగించనున్నారు.
ఏదైనా ఫిర్యాదు అందిన వెంటనే సత్వరం సదరు ప్రాంతానికి చేరుకుని ప్రాథమిక సమాచారం సేకరించి, సేవలందించాలని సూచించారు.
సత్వరం స్పందించి సేవలందించడం ద్వారా పోలీస్ శాఖ ప్రతిష్ట పెంపొందుతుందని ఆయన తెలిపారు.
