ఈ ఘటంలో మీనాక్షి, నయాన్షి అనే విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. నాడాపూర్ గ్రామం నుంచి విద్యార్థులను ఎక్కించుకొని నవీపేట్ వైపు వస్తుండగా అంకాలమ్మ గుడి వద్ద బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
బస్సు క్లీనర్ బస్సును నడపడంతో ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
