రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకముగా ప్రవేశ పెట్టిన నాలుగు సంక్షేమ పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్ల ఫలాలను అర్హులైన పేదలకు అందుతాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్ భరోసా ఇచ్చారు ఆయన ఆదివారం పోలీసు పరేడ్ గ్రౌండ్ లో జరిగిన గణతంత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథి గా హాజరు అయ్యారు జెండా ఆవిష్కరించి పోలీస్ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు లబ్దిదారులనుంచి దరఖాస్తులను స్వీకరించి, పరిశీలించి, గ్రామ సభల ద్వారా ముసాయిద జాబితాను తయారు చేయడం జరిగినది. అట్టి అర్హులైన లబ్దిదారులకు జిల్లాలోని 31 గ్రామీణ మండలాలకి ఒక గ్రామ పంచాయితీ చొప్పున 31 గ్రామ పంచాయితీల్లో 4 సంక్షేమ పథకాల ఫలాలను అందజేయడం జరుగుతుందన్నారు మహాలక్ష్మి పథకం క్రింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఈ పథకం క్రింద జిల్లాలో 2,40,825 కుటుంబాలకు 8,43,599 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు దీనికి గాను ప్రభుత్వం 25.41 కోట్ల రూపాయలు సబ్సిడీ అందించింది.2024-25 యాసంగి సీజనులో 5.18 లక్షల ఎకరాల సాగు అంచనాతో ప్రణాళికలు సిద్దం చేయడం జరిగింది. ప్రధానంగా వరి 4.19 లక్షల ఎకరాలు, శెనగ 16 వేల ఎకరాలు మొక్క జొన్న 23 వేల ఎకరాలు, ఎర్ర జొన్న 33 వేల ఎకరాలు సాగు అవుతుందని అంచనాలు సిద్దం చేయడం జరిగింది.
ఎరువులు: జిల్లాలో యాసంగి 2024-25 గాను యూరియా 75,000 మెట్రిక్ టన్నుల డి.ఎ.పి. 18,919 మెట్రిక్ టన్నుల పోటాష్ 12,618 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు 46,367 మెట్రిక్ టన్నుల అవసరమైతాయని అంచనా వేయడం జరిగింది.ఇందుకు గాను యూరియా 53,733 మెట్రిక్ టన్నుల, డి.ఎ.పి 11,482 మెట్రిక్ టన్నుల, పోటాష్ 1,333 మెట్రిక్ టన్నుల, కాంప్లెక్స్ ఎరువులు 35,542 మెట్రిక్ టన్నులు అమ్మడం జరిగింది.
రైతులకు అవసరమగు ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉన్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 4 విడతలలో మొత్తం 1,00,612 మంది రైతుల పంట రుణాలు 782.31 కోట్ల రూపాయలు రుణ మాఫీ చేయడం జరిగింది.అలాగే జిల్లాలో 2024 -25 సంవత్సరమునకు గాను ఇప్పటి వరకు రైతు భీమాకు అర్హత కలిగి వివిధ కారణాలతో చనిపోయిన 391 రైతులకు సంబంధించిన వారి వారి నామిని బ్యాంకు ఖాతాలలో 19.55 కోట్ల రూపాయలు నేరుగా జమ చేయబడినది.
2024-25 వానాకాలం సీజన్ లో మొత్తం 676 కేంద్రాల ద్వారా 4,91,497.280 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 78,488 రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసి 1140.27 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది.
జిల్లా ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. 3,03,118.800 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 44,703 రైతుల నుండి కొనుగోలు చేసి 151.56 కోట్ల రూపాయలను రైతులకు బోనస్ చెల్లించడం జరిగింది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము: 2024-25వ ఆర్థిక సంవత్సరములో ఇప్పటివరకు 1,18,353 కుటుంబాలలోని 1,65,428 కూలీలకు పని కల్పించబడినది. వారికి 45.19 లక్షల పని దినాలు కల్పించి 89.81 కోట్ల రూపాయలు చెల్లించటము జరిగినది.
సరాసరి వేతనము 199 రూపాయలు కూలీ చెల్లించి ప్రతి కుటుంబానికి సరాసరి 38 రోజుల పని దినములు కల్పించ బడినది.తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ:మహలక్ష్మి పథకం: జిల్లాలో 15.12.2023 నుండి 31.12.2024 వరకు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 3.61 కోట్ల సార్లు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు.
సగటున ప్రతిరోజు 94 వేల మంది మహిళా ప్రయాణీకులు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు.గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది.
జిల్లాలో ఇప్పటి వరకూ 2,78,065 కుటుంబాలకు ప్రతి నెల జీరో బిల్లులు జారీ చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద ఇప్పటివరకూ ప్రభుత్వం 102.66 కోట్ల రూపాయల సబ్సిడీని అందజేసిందన్నారు జిల్లాలో 1,155 పాఠశాలల్లో 99,952 విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందించబడుతుంది.
అమ్మ ఆదర్శ పాఠశాలలు : రాష్ట్రంలోని ప్రభుత్వ స్థానిక సంస్థల, పాఠశాలల్లో మౌలిఖ వనరుల అభివృద్ది కొరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేబట్టిన అమ్మ ఆధర్శ పాఠశాల కార్యాక్రమంలో మొదటి విడతలో భాగంగా 755 పాఠశాలలను ఎంపిక చేయబడింది.
ఇందులో భాగంగా ప్రతీ పాఠశాలల్లో 4 రకాల పనులకు ఇప్పటి వరకు 17.28 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగినది.జిల్లాలో వివిధ రకాల పథకాల క్రింద 4,063 అభివృద్ధి పనులను 558.80 కోట్ల రూపాయలతో మంజూరు చేయగా, 1010 పనులకు 116.46 కోట్ల రూపాయల ఖర్చుతో పనులు పూర్తి చేయడం జరిగింది. మిగిలిన పనులు పురోగతిలో కలవు.
నీటి పారుదల శాఖ: 8.38 కోట్ల రూపాయలతో చౌట్ పల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల నిర్వాహణకు పరిపాలన ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి.
చెక్ డ్యామ్‌లు: జిల్లాలో (10) చెక్ డ్యాములు పురోగతిలో కలవు ఇప్పటి వరకు 32.32 కోట్ల రూపాయల ఖర్చు చేయడం జరిగింది.జిల్లాలో 59,231 ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించడానికి 35 ఐడీసీ పథకాలు ఉన్నాయి.
ఫతేపూర్, సుబ్రియాల్ & చిట్టాపూర్ సంయుక్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం 9,214 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడానికి ప్రభుత్వం 149.66 కోట్ల రూపాయల పరిపాలనా ఆమోదం తెలిపింది. పనులు పురోగతిలో ఉన్నాయి.
వన మహోత్సవం: జిల్లా మొత్తం అటవీ ప్రాంతం 2,14,057 ఎకరాలు ఇది జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో 20.86% ప్రతిగ్రామ పంచాయితీలో ఒక నర్సరీని పెంచుతూ జిల్లాలో మొత్తం 530 నర్సరీలు మరియు మునిసిపల్ కార్పోరేషన్ మూడు మునిసిపాలిటీల యందు మొత్తము 34 పట్టణ నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగినది. 2024-25 సంవత్సరములో మొత్తం 48.359 లక్షల మొక్కలు జిల్లాలో నాటడం జరిగింది.
పరిశ్రమల శాఖ: జిల్లాలో 8 భారీ మరియు మధ్య తరహ పరిశ్రమలు 368.45 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించబడినవి. వీటి ద్వారా 7,324 మందికి ఉపాధి కల్పించబడినది. జిల్లాలో 807 సూక్ష్మ మరియు చిన్నతరహ పరిశ్రమలు, 419.28 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించబడి, 5,887 మందికి ఉపాధి కల్పించామన్నారు అదుపు డీసీపీ బస్వా రెడ్డి ఇతర అధికారులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు .
