సోమవారం నగరంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మేయర్ దండు నీతూ కిరణ్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి కార్యాలయం ఆవరణలో చెట్లు నాటారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు రక్త దానం చేశారు.
ఈ సందర్భంగా మాజీ మేయర్ నీతు కిరణ్ మాట్లాడుతూ…కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో పోరాడి చివరికి తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని తెలిపారు.
అలాగే గడిచిన 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకని పథకాలతో ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు.
అందుకే త్వరలో ప్రజల కోసం ప్రభుత్వానికి ప్రశించే విధంగా బాస్ ఇస్ బ్యాక్ గ్రౌండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నరాని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుజిత్ సింగ్ ఠాగూర్, మాజీ నూడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, న్యలం రమేష్, శ్రీనివాస్ గౌడ్, పంచరెడ్డి సురేష్, సిర్పరాజు, తదితరులు పాల్గొన్నారు.
