లారీ ఢీకొన్న ఘటనలో ఇంటర్ విద్యార్థిని దుర్మరణం చెందింది. ఈ ఘటన నవీపేట మండలంలో సోమవారం చోటు చేసుకుంది.
నవీపేటకు చెందిన తేజస్విని(16) ఇటీవల 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్ చదివేందుకు నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో చేర్పించారు.
తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై నిజామాబాద్ వైపు వెళ్తుండగా నవీపేట-బాసర రహదారిపై లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
