టాస్క్ ఫోర్స్ పోలీసులు పేకాట స్థావరం పై మెరుపు దాడు నిర్వహించారు.
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి సార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్సై గోవింద్, సిబ్బంది నిజామాబాదు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్ల గుట్ట గ్రామ అటవీ ప్రాంతం లో విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరం పై దాడి చేసి 6మంది పేకాట రాయుళ్ళు మరియు 7 సెల్ ఫోన్స్, నగదు 102000/- స్వాధీనం చేసుకొని చర్య నిమిత్తం నిజామాబాదు రూరల్ పోలీసులు అప్పగించినట్లు తెలిపారు.
