HomeTelanganaNizamabadవైశ్య ఎన్నికల్లో మాణిక్ భవన్ కమిటీ ఎన్నికే ప్రతిష్టాత్మకం …….ఛైర్మెన్ కోసం హోరాహోరీ ……..భారీ ఆస్తుల...

వైశ్య ఎన్నికల్లో మాణిక్ భవన్ కమిటీ ఎన్నికే ప్రతిష్టాత్మకం …….ఛైర్మెన్ కోసం హోరాహోరీ ……..భారీ ఆస్తుల ఫై కొనసాగుతున్న వివాదం

నిజామాబాద్‌ నగరంలో వైశ్య కుల సంఘం ఎన్నికలు ఉత్కంఠ భరితంగా మారాయి. ప్రధాన సంఘం ఎన్నికలు సాదాసీదాగా సాగుతున్నాయి.కానీ అనుబంధ సంఘంగా ఉన్న
చారిత్రాత్మక విద్యాసంస్థ నూతన వైశ్య ఉన్నత పాఠశాల మాణిక్ భవన్ ఎన్నికే కీలకంగా మారింది..

ఈ ఎన్నికే అందరికి ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ పాలక మండలి లో పాగా వేయడానికి అందరు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.సంస్థ అధీనం లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు వుండడం వల్లే ఈ పాఠశాల పాలకమండలి కమిటీ ఎన్నికలు హోరాహోరీగా మారాయి.


పోలింగ్ జూలై 7నజరగనున్నాయి.యువ వ్యాపారి .రిటైర్ ఉన్నతాధికారి అధ్యక్ష పదవీ కోసం పోటీ పడుతున్నారు. నగరంలో దిగ్గజ వ్యాపారాలు ఈ ఎన్నిక కోసం రెండు గ్రూప్ లుగా ఏర్పడ్డారు.ఈ సంస్థ ఆస్తులే లక్ష్యంగా తీవ్రమైన ఆరోపణలతో రచ్చకెక్కుతున్నారు.

మాజీ సీఎం నీలం సంజీవరెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన, మాజీ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపిన ఈ పాఠశాల, కు గజవాడ మాణిక్యం స్థలం దాత కావడం వల్ల “మాణిక్ భవన్”గా గుర్తింపు పొందింది.


శివాజీనగర్‌లో 1.20 ఎకరాల్లో విస్తరించిన ప్రధాన భవనం,ఉంది. అనేక మంది విద్యార్థులు ఈ స్కూల్ లో ఖ్యాతి పొందార. చాల మంది ప్రముఖులు ఇదే స్కూల్ లో చదివారు. సంస్త కు చెందిన బోర్గం బ్రిడ్జ్ సమీపంలో ఉన్న 4.20 ఎకరాల భూమి విషయంలో దశాబ్ద కాలంగా వివాదం కొనసాగుతుంది.

గతంలో అధికార పార్టీ కి చెందిన ప్రజాప్రతినిధులు తెరవెనుక మంత్రాంగం నడిపి కోట్లాది రూపాయల విలువైన ఈ భూమి చెరబట్టే యత్నాలు చేసారు. భూమి విరాళంగా ఇచ్చిన వ్యక్తి అడ్డం పెట్టుకొని అన్యాక్రాంతం చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ వ్యవహారం సుప్రీం కోర్టు దాక వెళ్ళింది.

అయినప్పటికీ ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతుంది.రెండు వర్గాలు ఈ వివాదంలో తలపడుతున్నాయి.ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి.

ఈసారి అధ్యక్ష పదవికి రెండు శక్తివంతమైన వ్యక్తులు బరిలో నిలవడం ఉత్కంఠ రేకెత్తిస్తోంది:

ఇంగు శివప్రసాద్ గుప్తా

ప్రస్తుతం కమిటీ జనరల్ సెక్రటరీ గా కొనసాగుతున్న ఈయన, గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రజల ఆదరణ లభించిందని చెబుతున్నారు. ప్రారంభించిన పనుల్ని పూర్తి చేయాలంటే ప్రజలు మరోసారి అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


అవసరమైన మార్పులు, నిర్మాణ పనులు కొనసాగించేందుకు అర్ధవంతమైన అనుభవంతో నేను సిద్ధంగా ఉన్నాను, అని చెబుతున్నారు.

గజవాడ హనుమంతరావు

ఈ పాఠశాలలో విద్యార్థిగా విద్యనభ్యసించిన వారైన గజవాడ హనుమంతరావు, ఇది నన్ను నిర్మించిన విద్యాలయం – ఇప్పుడు నేను దీనిని నిర్మించాలనే తపనతో బరిలోకి వచ్చాను, అంటున్నారు.


బోర్గం బ్రిడ్జ్ సమీపంలోని స్థలంలో నూతన భవన సముదాయ నిర్మాణం, ఆధునిక విద్యా పథకాలు తన ప్రాధాన్యతలు అని స్పష్టంచేస్తున్నారు.

వైశ్య సమాజ దృష్టి ఇప్పుడు మాణిక్ భవన్‌పై.

ఈ ఎన్నికల్లో అభ్యర్థుల అనుభవం, అభివృద్ధి వైఖరి, ప్రజలతో ఉన్న అనుబంధం కీలకంగా మారనున్నాయి. విద్యా సేవల మైదానంలో ఈ పాఠశాల మరింత ఉన్నత స్థాయికి చేరాలంటే ఎవరి నాయకత్వం అవసరం అన్నది సమాజ తీర్పుతో తేలనుంది.

జూలై 7– ఈ కీలక తేదీ మాణిక్ భవన్ భవిష్యత్తు దిశను నిర్ణయించబోతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments