రైలు ఢీ కొని గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు.
నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ హరికృష్ణ ఇచ్చిన సమాచారం ప్రకారం సుమారు 50 సollల గుర్తు తెలియని మహిళ నిజామాబాదు – జానకంపేటు మధ్య గుర్తు తెలియని రైలు యొక్క రాకను గమనించకుండ రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొని అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
మృతురాలి వివరాలు తెలిసిన వారు 8712658591, 9493451642 నెంబరుకు సమాచారం అందించాలని ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు.
