రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ బుచ్చయ్య కుటుంబానికి 2004 బ్యాచ్ కానిస్టేబుళ్ళు ఆర్థిక సహాయం అందించారు.
2004 బ్యాచ్లో తమతో పాటు శిక్షణ తీసుకున్న బుచ్చయ్య అకాల మరణం చెందిన విషాదవార్త మన అందరినీ తీవ్రంగా కలచివేసిందనీ అన్నారు.
ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబానికి సహాయాన్ని అందించడానికి ఆదివారం దుడ్కి లో కుటుంబ సభ్యులను పలకరించి ఉమ్మడి నిజామాబాద్ కి చెందిన 2004 బ్యాచ్ కి చెందినవారు, అలాగే అనంతపూర్ పీటీసీ లో ట్రైనింగ్ చేసిన 2004 బ్యాచ్ కి చెందిన వారు కలిసి వారి బ్యాచ్ తరుపున రూ 3,00,000/- అందజేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పి. నర్సింగ్ రావు,సురేష్,రాజశేఖర్,నరేష్, సాయిలు, శైలేష్,నేత రెడ్డి,స్వప్న,అనంతపూర్ కు చెందిన ప్రసాద్,రవీందర్,శివ,శంకర్ లు తదితరులు పాల్గొన్నారు.
