HomeTelanganaNizamabadకలెక్టర్ గారు మాకు న్యాయం చేయండి" – మేకల మండిలో నిరసన

కలెక్టర్ గారు మాకు న్యాయం చేయండి” – మేకల మండిలో నిరసన

నిజామాబాద్: పట్టణంలోని హైమద్ బజార్ పాత మేకల మండి ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఆర్ఎంబి బిల్డింగ్ వద్ద ఈరోజు ఉదయం స్థానిక మిరియాల కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.

“కలెక్టర్ గారు మాకు న్యాయం చేయండి” అంటూ నినాదాలు చేస్తూ మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు. భూమి 1928వ సంవత్సరంలో మిరియాల వారి తాతగారు కొనుగోలు చేసిన పట్టా ల్యాండ్ అని పేర్కొన్నారు.

అయితే గత ప్రభుత్వం వారి పై అనేక అక్రమ కేసులు బనాయించి, భూమిని బలవంతంగా లాక్కొని, ఆర్ఎంబి ప్రభుత్వ శాఖ ద్వారా భవనం నిర్మించిందని ఆరోపిస్తున్నారు.”

ఈ భూమిపై మాకు పూర్తి స్థాయిలో హక్కు ఉంది. కానీ అధికారుల కుట్రతో మా భూమిని గక్కేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి,” అంటూ బాధితులు మీడియాతో మాట్లాడారు.

విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఈ నిరసన చేపట్టినట్టు తెలిపారు. అధికారులు స్పందించి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments