HomeTelanganaNizamabadనిజామాబాద్‌లో పద్మశాలి హాస్టల్ ఎన్నికల హోరాహోరీ

నిజామాబాద్‌లో పద్మశాలి హాస్టల్ ఎన్నికల హోరాహోరీ

నిజామాబాద్ జిల్లా పద్మశాలి విద్యార్థి వసతి గృహం సంఘం ఎన్నికలు ఆదివారం ఉదయం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.

ఈసారి ఎన్నికల్లో మూడు ప్యానెల్లు బరిలో నిలిచాయి హోరాహోరీగా తలపడుతున్నాయి శంకు గుర్తుతో S.R. సత్యపాల్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ఏనుగు గుర్తుతో కొండి రమేష్ అధ్యక్ష పదవికి బరిలో ఉన్నారు. సూర్యుడు గుర్తుతో దీకొండ యాదగిరి ఈ ముగ్గురు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు.మొత్తం 894 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.ఎన్నికల ప్రచారం నిజామాబాద్‌లో ఎమ్మెల్యే ఎన్నికలను తలపించేలా ఉత్కంఠభరితంగా సాగింది.

అభ్యర్థులంతా తమ విజయానికి ఆఖరి నిమిషం వరకు శక్తివంచన లేకుండా కృషి చేశారు.ఓటింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఈ రాత్రి నుంచి రేపటివరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఎన్నికలు రసవత్తరంగా సాగుతుండడంతో ఎవరి విజయం కాగలదన్న ఉత్కంఠ విద్యార్థుల వర్గాల్లో పెరిగిపోతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments