నగరంలోని దేవి రోడ్డులో వన్ వే తొలగించాలనీ దుకాణ యజమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.గత నెల రోజుల నుంచి దేవి రోడ్డులో వన్ వే చేయడంతో తమ వ్యాపారాలు దెబ్బ తింటున్నాయనీ రోడ్డు పై నిరసనకు దిగారు.
దీంతో వెంటనే ట్రాఫిక్ సిబ్బంది,ఒకటవ టౌన్ సీఐ రఘుపతి అక్కడికి చేరుకుని వారిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు వారు తమకు న్యాయం జరిగే వరకు తమ దుకాణాలు తెరవమనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు పోలీసులకు దుకాణదారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
