నిజామాబాద్ నగరంలోని హింగులాంబిక ఆలయంలో చోరీ జరిగింది. ఈ సంఘటన నగరంలోని మూడవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం..
నగరంలోని ఆదర్శనగర్ ప్రాంతంలో గల హంగూలంబిక ఆలయంలో గుర్తుతెలియని దుండగులు ఆదివారం రాత్రి ఆలయ తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించి, అమ్మవారి విగ్రహంపై ఉన్న సుమారు మూడున్నర తులాల బంగారు ఆభరణాలను,ఒక డివిఆర్ ను అపహరించినట్లు తెలిపారు.
సోమవారం స్థానికుల సమాచారం మేరకు మూడవ టౌన్ ఎస్ఐ ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిబాబు తెలిపారు.
