HomeLaw and Orderమా ఓపిక నశించింది-- ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యం..

మా ఓపిక నశించింది– ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యం..

.ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఫీజు రియంబర్స్మెంట్ పైన మాకు ఎన్నో ఆశలను రేకెత్తించింది. గత ప్రభుత్వం ఒక సంవత్సరం ఫీజులను మరొక సంవత్సరం ఇవ్వడంతోనే ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొన్నాము.

ఈ ప్రభుత్వంపై గంపెడు ఆశలతో మేము విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాం కానీ ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్న గాని పాత బిల్లులకు మోక్షం లభించలేదు, మేము ఎన్ని విధాలుగా విన్నవించుకున్నా గాని మా అభ్యర్థనలను పెడచెవిన పెట్టారు, న్యాయంగా మాకు రావలసిన స్కాలర్షిప్ డబ్బుల కొరకు గతంలో బందు పెట్టినాం ప్రభుత్వం తరఫున మాతో మాట్లాడినారు…

విద్యార్థులకు మరియు మాకు రావలసిన స్కాలర్షిప్ డబ్బుల పై హామీ ఇవ్వడంతో మేము వారిని నమ్మి గతంలో మా సమ్మెను విరమిచాం కానీ ఇప్పటివరకు మాకు రావాల్సిన బకాయిల్లో నుండి కనీసం 10% డబ్బులు కూడా రాలేదు. ప్రతినెల మేము ఒక కాలేజీ నడపడానికి 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

మా దగ్గర ఉన్న ఫిక్స్ డిపాజిట్ డబ్బులు అయిపోయాయి, మా పర్సనల్ బంగారు నగలను తాకట్టు పెట్టి ఇన్ని రోజులు కళాశాలలను నడిపినాం, ఇకముందు నడపడానికి మా దగ్గర ఎటువంటి ఆదాయ వనరు లేదు ఏ ఆధారం లేనందున కాలేజీలను మూసివేశాము.

ఇక మమ్మల్ని నీట ముంచినా పాలముంచిన ప్రభుత్వానిదే బాధ్యత. మా డబ్బులు మొత్తం వచ్చే వరకు మేము కాలేజీలను తెరిచే ప్రసక్తి లేదు ప్రైవేటు కళాశాలల యాజమాన్యం అధ్యక్ష కార్యదర్శులు జైపాల్ రెడ్డి మరియు నరాల సుధాకర్ అన్నారు

ఈ పత్రిక విలేకరుల సమావేశంలో మారయ్య గౌడ్ దాసరి శంకర్ సూర్య ప్రకాష్ దత్తు శ్రీనివాస్ బాలకృష్ణ శంకర్ శంకర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments