HomeCRIMEకొడిచెర్ల మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా..అడ్డుకున్న రైతులు....తప్పుడు వే బిల్లులతో ఇసుక అక్రమ...

కొడిచెర్ల మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా..అడ్డుకున్న రైతులు….తప్పుడు వే బిల్లులతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న మాఫియా ..రెవెన్యూ, మైనింగ్ శాఖ పోలీసులపై ఆరోపణలు..తాసిల్దార్ ఎస్ఐలను నిలదీసిన రైతులు..

మంజీరా లో అక్రమంగా రోడ్లు ఎలా వేశారని నిలదీత నిజామాబాద్ జిల్లా పొతగల్ మండలం కొడిచెర్లనుంచి నిజామాబాదులో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అనుమతులు అంటూ పక్క దారి పట్టిస్తున్నారు ప్రైవేటు వెంచర్లలో ఇసుక డెంపులు చేసి ఇసుక అమ్ముకుంటున్నారు ఈ వ్యవహారంపై పొతంగల్ రైతులు ఆందోళనకు దిగారు . ఇసుక అక్రమ రవాణాకు కళ్లెం వేయాల్సిన రెవిన్యూ పోలీస్ శాఖలు రాచ మార్గాలు వేయడం తీవ్ర ఆరోపణలకు కారణమవుతుంది వాస్తవానికి ఓ ప్రైవేటు రైతు చెందిన రెండు ఎకరాల భూమిలో ఇసుక మేట వేసింది. ఈ ఇసుకమేట తొలగించడానికి మైనింగ్ శాఖ అధికారుల నుంచి అనుమతులు పొంది, రెండు ఎకరాల్లో ఇసుకమేట తొలగించకపోయినప్పటికీ, 100 ఎకరాల లోపు మంజీరా నదిలో రోడ్డు నిర్మించి దర్జాగా అక్రమ ఇసుక తరలించుకో పోతున్నారంటూ పోతంగల్ రైతులు ఇసుక మాఫియా పై మండిపడుతున్నారు. ఇలాంటి అనుమతులు లేకుండా, రెండు నెలల క్రితం ఉన్న వే బిల్లులతో రైతులను బురిడీ కొట్టించి అక్రమ ఇసుక దందా నిజామాబాద్, బోధన్, హైదరాబాద్ కు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారని రైతులు సోమవారం సాయంత్రం అక్రమంగా తప్పుడు వే బిల్లులతో తరలించకపోతున్న 20 ఇసుక టిప్పర్లను అడ్డుకొని అధికారుల పనితీరుపై, మైనింగ్ శాఖ అధికారుల అవినీతిపై నిలదీశారు సుమారు రెండు గంటలపైనే రోడ్డుపైనే బయటయించారు. తమకు అవసరాల నిమిత్తం ఒక ట్రక్టర్ ఇసుక తీసుక వెళితే, ఒకవైపు పోలీస్ శాఖ, మరొకవైపు రెవిన్యూ శాఖ, ఇంకొక వైపు మైనింగ్ శాఖ దాడులు చేసి కాగితాలు ఉన్నాయా,? అనుమతులు ఉన్నాయా? అంటూ సవా లక్ష ప్రశ్నలు వేసి ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్లో పెట్టి నెలల తరబడి రైతులకు ఇబ్బంది పెడుతున్నారు అక్రమ రవాణా అధికారులకు కనిపించడం లేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు వేలాది క్యూబిక్ మెట్రిక్ టన్నుల ఇసుక తలించకపోతే మైనింగ్ శాఖ అధికారులు నిద్రపోతున్నారా? పోలీస్ శాఖ ఏం చేస్తుందని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మంజీరా నది నుంచి ప్రతి రోజు 20 ట్రిప్పర్ల పైగా భారీ లోడుతో ఇసుక తరలించకపోతే పొతంగల్ రోడ్డుపై ఇసుక టిప్పర్లను నిలిపివేసి నిరసన తెలిపారు. తప్పుడు వే బిల్లులతో అక్రమంగా తరలించకపోతున్న ఇసుక మాఫియా పై చర్యలు తీసుకోవాలంటూ రైతులు అధికారులకు డిమాండ్ చేస్తున్నారు. ఇష్ట రాజ్యాంగ అధిక లోడుతో ఇసుక తరలించకపోతే సంబంధిత శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ రైతులు నిలదీశారు. ఇసుక మాఫియాకు అమ్ముడుపోయి అక్రమంగా ఇసుక తరలించడానికి సంబంధిత శాఖ అధికారులు ప్రత్యక్షంగా సహకరిస్తున్నారంటూ రైతులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కళ్ళ ముందు నుంచే పెద్ద పెద్ద టిప్పర్లలో 60 టన్నులకు పైగా అక్రమంగా ఇసుక తరలించకపోతే అధికారులు మామూళ్లకు ఆశపడి అక్రమ ఇసుక తరలింపుకు సహకరిస్తున్నారని రైతులు అడ్డుకొని అధికారుల పనితీరుపై మండిపడ్డారు రైతు వద్ద నుంచి రెండు ఎకరాల భూమిలో ఉన్న ఇసుక తీసుకువెళ్లడానికి అనుమతి పొంది 100 ఎకరాల్లో ఇసుక తీసుక వెళ్లడానికి రోడ్డు వేసుకుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు . ఒకపక్క మహారాష్ట్ర ఇసుక మాఫియా, మరొకవైపు నిజామాబాద్ ఇసుక మాఫియా మంజీరా నదిలో చెలరేగి పోతున్నారని రైతులు తీవ్రంగా ఆరోపించారు. నాలుగు గంటలుగా రోడ్డుపై ఇసుక టిప్పర్లను నిలిపివేసి రైతులు నిరసన వ్యక్తం చేశారు . రైతులు లారీలను ఆపి నిరసన వ్యక్తం చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న కోటగిరి ఎస్సై సునీల్ సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో చర్చించారు. అక్రమంగా వే బిల్లులు లేకుండా ఇసుక తరలించకపోతే రైతులు ఎస్సై ముందు తమ గోడు వినిపించారు. మైనింగ్ శాఖ ఏడి, తాసిల్దార్, ఇక్కడికి వచ్చి సరియైన సమాధానం చెప్పే వరకు తమ ఆందోళన ఆపమంటూ రైతులు భీష్ముంచుకొని కూర్చున్నారు. ఘటనా స్థలానికి తాసిల్దార్ గంగాధర్ చేరుకొని రైతులతో మాట్లాడారు స్థానికులు రైతులు తాసిల్దార్ గంగాధర్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రెవిన్యూ మైనింగ్ పోలీస్ శాఖల అండదండలతోనే మంజీరా నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని అధికారులను నిలదీశారు ఎంత చెప్పినా ఆందోళన విరమించలేదు సాయంత్రం 6 గంటల వరకు ఆందోళన కొనసాగుతూనే ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments