నిజామాబాద్ నగర ఏసిపి రాజా వెంకటరెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆయనను రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి (డీజీపీ ఆఫీస్) రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశిస్తూ డీజీపీ కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
రెండేళ్ల క్రితం నిజామాబాద్ ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన రాజా వెంకటరెడ్డి, నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పెండింగ్ కేసుల పరిష్కారంలో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా చోరీలకు గురైన మొబైల్ ఫోన్ల రికవరీ, నగర ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో కీలక పాత్ర పోషించారు.
తాజాగా వెలువడిన బదిలీ ఉత్తర్వుల్లో ఆయనకు ఎక్కడా పోస్టింగ్ కేటాయించకుండా, తక్షణమే డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.
