ఇడుపు కాయితం’అంటే ఏమిటో ఏపీ డిప్యూటీ సీఎం సినిమా నటుడు పవన్ కళ్యాణ్ కు అడిగితే చెప్తారని మాజీ ఎమ్మెల్సీ కవిత అన్నారు ఇడుపు కాయితం సినిమా టైటిల్‌పై ఏపీ లో జరుగుతున్న ట్రోలింగ్‌ను ప్రస్తావిస్తూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సైలెంట్‌గా మౌనంగా ఉండటం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేని సీఎం రేవంత్ రెడ్డి.. ఇక్కడి భాషను అవమానిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు.
ఇవాళ ఉప్పల్‌లో పార్టీ జెండా ఆవిష్కరించిన ఆమె.. బీఆర్ఎస్లోని ఓ గుంటనక్క ఆంధ్రా కార్పొరేట్ శక్తులతో వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు.తెలంగాణ వాదం మీద దాడి జరిగితే ఊరుకోబోమన్నారు
