HomeCRIMEనెహ్రూనగర్ శివారులో గంజాయి విక్రయం.. ఇద్దరు అరెస్ట్

నెహ్రూనగర్ శివారులో గంజాయి విక్రయం.. ఇద్దరు అరెస్ట్

నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని టౌన్-6 పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 60 గ్రాముల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం..

గురువారం మధ్యాహ్నం నెహ్రూనగర్ శివారులోని వాటర్ ట్యాంక్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో ఎస్సై సందీప్, ఎస్సై నారాయణ్ సింగ్ సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీసులను గమనించిన ఇద్దరు వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించగా వెంటాడి పట్టుకున్నారు.విచారణలో వారు అబ్దుల్ జియా, షిండే అక్షయ్ కుమార్గా గుర్తించారు. నాందేడ్‌లో గంజాయి కొనుగోలు చేసి నిజామాబాద్ శివారులో గుర్తు తెలియని వ్యక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వారు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

ఘటన సమయంలో అక్షయ్‌కు చెందిన ఆటోలో గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు.నిందితుల వద్ద నుంచి 60 గ్రాముల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో టౌన్-6 పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments