ప్రమాదవశాత్తు వాగులో పడిన చెల్లిని కాపాడేందుకు వెళ్లిన అన్న కూడా నీటిలో గల్లంతై మృతిచెందిన విషాద ఘటన నవీపేట్ మండలం జన్నేపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అల్లే లయ (24) ప్రమాదవశాత్తు వాగులో పడిపోయింది.
ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన అన్న అల్లే గణేశ్ (27) కూడా వాగులోకి దిగడంతో గల్లంతయ్యాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గణేశ్ మృతదేహం లభ్యమైంది.
లయ ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. ఆమె కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
