Monday, April 20, 2026
HomePOLITICAL NEWSహస్తం ఖాతాలో... ఆర్మూర్ మున్సిపాలిటీ- ఆర్మూర్ మున్సిపల్

హస్తం ఖాతాలో… ఆర్మూర్ మున్సిపాలిటీ- ఆర్మూర్ మున్సిపల్

నూతన చైర్మన్ గా ఎన్నికైన అయ్యప్ప లావణ్య శ్రీనివాస్- నూతన చైర్మన్ గా ఎన్నికైన లావణ్య శ్రీనివాస్ ను సన్మానించిన వినయ్ రెడ్డి,డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి – క్యాంపు నుండి మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చిన కౌన్సిలర్లు – చివరి వరకు చైర్పర్సన్ కోసం యత్నించిన సంగీత శ్రీనివాస్జాన రమేష్ ఇది సంగతి: గత ఎన్నో రోజులుగా ఉత్కంఠ రేపిన ఆర్మూర్ మున్సిపల్ బల్దియా అనుకున్నట్టే హస్తం ఖాతాలో చేరింది.

గతంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న పండిత్ వినీత పై సొంత పార్టీకి చెందిన బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసపు సెగ పెట్టడంతో బల పరీక్షలో విశ్వాసం నెగ్గింది. దీంతో కొంతకాలం ఇంచార్జి చైర్మన్ గా వైస్ చైర్మన్ షేక్ మున్ను కొనసాగారు. చైర్మన్ ఎన్నిక కోసం మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో గురువారం మున్సిపల్ ఛాంబర్ లో నూతన అధ్యక్ష ఎన్నిక జరిపారు.

కోరం సభ్యులు హాజరు కావడంతో నూతన చైర్ పర్సన్ గా అయ్యప్ప లావణ్య శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఎన్నికకు ముందు చైర్పర్సన్ రేసులో ఉన్న అయ్యప్ప లావణ్య, ఖాందేశ్ సంగీతతో చర్చించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమెను నూతన చైర్ పర్సన్ గా ఎన్నుకున్నారు. ఆర్మూర్ మున్సిపల్లో మొత్తం 36 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే రాకేశ్రడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. కాగా, సమావేశానికి సరిపోను కోరం సభ్యులు హాజరయ్యారు. వీరి మద్దతుతో లావణ్య చైర్పర్సన్గా ఎన్నికయ్యారు.

అయితే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత, బీజేపీ కౌన్సిలర్లు, మరికొందరు సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా క్యాంపునకు వెళ్లిన కాంగ్రెస్ కౌన్సిలర్లు గురువారం ఉదయం పట్టణానికి చేరుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, కాంగ్రెస్ ఆర్మూర్ ఇన్చార్జి వినయ్ రెడ్డి కౌన్సిలర్లను సన్మానించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!