HomeCRIMEఈనాడు బిల్డింగ్ మీది నుంచి ఉద్యోగి ఆత్మహత్య ……రామోజీ ఫిల్మ్ సిటీ లో ఘటన ………

ఈనాడు బిల్డింగ్ మీది నుంచి ఉద్యోగి ఆత్మహత్య ……రామోజీ ఫిల్మ్ సిటీ లో ఘటన ………

ఈనాడు మహిళా ఉద్యోగి.. ఈనాడు ఆఫీసులోని నాలుగో అంతస్తు నుంచి దూకి మృతి చెందింది. రామోజీ రావు ఉండే ఫిలిం సిటీ లో ఈ ఘటన జరిగింది.సోమవారం ఉదయం జరిగింది. అబుల్లాపుర్ మెట్ పోలీసులు ఇంకా వివరాలు వెల్లడించలేదు. మృతు రాలు కొన్నాళ్లుగా ఈనాడు కార్యాలయంలో కాల్ సెంటర్ లో పని చేస్తున్న సాయికుమారి. గా గుర్తించారు.సోమవారం ఆఫీసుకు వచ్చిన ఆమె ఫిల్మ్ సిటీలో ఈనాడు బిల్డింగ్ పైనుంచి దూకిది . సాయికుమారి భర్త రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఉద్యోగం చేస్తున్నారు. వీరి కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు కార్యాలయంలో పని చేసే సాయికుమారి ఆత్మహత్య అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అక్కడే పనిచేసే వారెవరైనా వేధింపులకు గురిచేసారా ? లేదంటే వ్యక్తిగత కారణాలతో ఆత్మ హత్య చేసుకున్నారా అనేది విచారణలో తేలాల్సిందే .ఆఫీస్ విధుల్లో ఉండగా.. ఆఫీస్ బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోవటంతో ఉద్యోగులు షాక్ అయ్యారు. . .. ఫిల్మ్ సిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాయికుమారి ఆత్మహత్యకు కారణాలపై ఇతర ఉద్యోగులను అడిగి తెలుసుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

రెండు నెలల క్రితం కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో .క్రేన్ వైరు తెగిపోయి.. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ కో ఫౌండర్ చనిపోయారు. ఈ కంపెనీ ఈసీవో తీవ్రంగా గాయపడ్డారు. రెండు నెలల్లో రెండు విషాధ ఘటనలు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగటం చర్చనీయాంశం అయ్యింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments