కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు గొడవపడి కత్తులతో దాడి చేసుకున్న ఘటన బుధవారం రాత్రి బాన్సువాడ పట్టణంలో చోటుచేసుకుంది.
తాడ్కోల్ చౌరస్తాలోని ఓ బార్ వద్ద నడి రోడ్డుపై మద్యం మత్తులో సోనుసింగ్,సంజీవ్ అనే ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారితీసింది.
ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.దీంతో సోనుసింగ్ తల్వార్‌తో ఆటో డ్రైవర్ సంజీవైపై దాడి చేశాడు. క్షతగాత్రుడు తీవ్ర రక్తస్రావమై పడిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంజీవ్‌ను చికిత్స నిమిత్తం హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నిజామబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
