నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ ప్రాంతంలోని మూడవ టౌన్ పరిధిలోని ఓ మెడికల్ లో భారీ చోరి జరిగినది. ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.
.కంటేశ్వర్ ప్రాంతంలోని తాళం వేసి ఉన్న గజానన్ మెడికల్ షాప్ లో శుక్రవారం రాత్రి దుండగులు చొరబడి క్యాష్ కౌంటర్ నుంచి ఒక లక్ష 18 వేల రూపాయలు అపహరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
మెడికల్ షాప్ యాజమాని బందే వారి సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మూడవ టౌన్ ఎస్సై మహేష్ పేర్కొన్నారు.
