శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారు మంగళవారం ఆరోరోజు ఆరున్నర కిలోల బంగారు ఆభరణాలతో దర్శనమిచ్చారు.
వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 52వ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
రోజుకో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారన్నారు. అమ్మవారిని చూసేందుకు భక్తులు తరలివచ్చారు.
