లా కాలేజీ లో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపింది. కళాశాల ప్రిన్సిపాల్ పట్టించుకోక పోవడంతో బాదితురాలు నేరుగా జాతీయ యస్సి కమిషన్ ను ఆశ్రయించింది.ఈ ఘటనపై దర్యాప్తు జరిపి నివేదిక అందించాలంటూ కమిషన్ డిసెంబర్ 11న ఆదేశాలు జారీ చేసింది.
దీనితో పోలీసులు రంగంలోకి దిగి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ లా కాలేజీ లో జరిగింది .
ఈ ఘటనను పలుమార్లు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో తాను జాతీయ ఎస్సీ కమిషన్ కు వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది విద్యార్థిని.లైంగిక వేధింపులు తన ఒక్కదానికే పరిమితం కాలేదని..
చాలామంది విద్యార్థినులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదు లేఖలో పేర్కొంది విద్యార్థిని.
